ఆకాశ్ Vs నాగ శౌర్య.. ఈ శుక్రవారం కుర్రాళ్ల మధ్య పోటీ.. గెలిచేదెవరో..

akash puri and naga shourya | శుక్రవారం వచ్చింది.. ఎప్పటిలాగే కొత్త సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఈ వారం ఇద్దరు కుర్ర హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. వీళ్లు నటించిన సినిమాలపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. భారీ బ్యాక్ గ్రౌండ్‌తో వస్తున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఆకాశ్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్, నాగశౌర్య నటించిన వరుడు కావలెను సినిమాలు అక్టోబర్ 29న పోటీ పడుతున్నాయి. వీటిలో రొమాంటిక్ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. వరుడు కావలెను సినిమాను వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. దీంతో ఈ రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. అది కాకుండా వీటిల్లో ఒకటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాగా.. మరొకటి పూర్తిగా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.

మూడేళ్ల కింద మెహబూబా సినిమాతో హీరోగా మారిన ఆకాశ్ పూరీ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో భారీ గ్యాప్ తీసుకుని ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో వస్తున్నాడు. ఈ సారి టార్గెట్ మిస్ అవ్వదు.. కచ్చితంగా బాక్స్ బద్ధలైపోతుందని అంటున్నాడు. దీనికి తోడు ఈ సినిమాకు ప్రభాస్ ప్రమోషన్ చేయడం అదనపు ఆకర్షణగా మారింది. ఎప్పుడూ లేనివిధంగా రొమాంటిక్ సినిమా కోసం ప్రభాస్ యాంకర్‌గా మారిపోయాడు. ఆకాశ్, కేతిక శర్మను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాడు.

మరోవైపు నాగశౌర్య సైలెంట్ కిల్లర్‌గా వస్తున్నాడు. లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన వరుడు కావలెను సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. ఇక వరుడు కావలెను సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ ప్రమోషన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు కూడా 10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా మంచి కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం. మరి ఈ వారం బాక్సాఫీస్ పోరు ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర హీరోయిన్గా పరిచయం అవుతుందా..?
Samantha | సమంత పోస్టుపై వెంకటేశ్ కూతురి ఆసక్తికర కామెంట్
మొన్న ప్రభాస్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. కొడుకు కోసం పూరీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?
ఇద్దరు ఫ్లాప్ హీరోల పోటీ.. మరి బాక్సాఫీస్ దగ్గర గెలిచేదెవరో
kethika sharma | జీవితకథల్లో నటించాలి
Ritu Varma | పెళ్లికి తొందరేం లేదు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

