Ajith Kumar | తమిళ అగ్ర నటుడు అజిత్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను రేస్ పోటీలు పూర్తయ్యేవరకు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించాడు. అజిత్‌కు కారు రేసింగ్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘అజిత్ కుమార్ రేసింగ్’ అనే పేరుతో ఒక టీంను ఏర్పాటు చేశాడు. అయితే అజిత్ ప్రాక్టీస్ చేస్తున్న కార్ రేస్ ఈ నెల జనవరి 12న ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరుగనున్న ఈ రేసింగ్ పోటీలు రెండు రోజులు జరుగనుండగా.. దీనికోసం డై ఆండ్ నైట్ శ్రమిస్తున్నాడు. ఇటీవలే ప్రాక్టీస్ రేస్‌లో భాగంగా అజిత్ నడుపుతున్న కారు యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతిన్నప్పటికీ అజిత్‌కి ఎటువంటి గాయాలు కాకుండా బయట పడ్డాడు. అయితే ఈ రేసు రేపు జరుగతుండగా..
తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఒక కారు రేసింగ్ టీం ఓనర్‌గా ఉన్న నేను రేసింగ్ సీజన్ మొదలయ్యే వరకు ఎలాంటి సినిమా కాంట్రాక్ట్‌పై సంతకం చేయనని చెప్పారు. అక్టోబర్ నుంచి మార్చి వరకు నటించాలనేది ప్లాన్ అని.. ఇప్పుడు తాను డ్రైవర్‌గానే కాకుండా టీమ్ ఓనర్‌గా కూడా రేసింగ్ టీంలో భాగమవ్వాలని భావిస్తున్నట్లు అందుకే రేసింగ్ పోటీలు పూర్తయ్యేవరకు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించాడు.
అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన విడా ముయార్చి సినిమాతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తున్నాడు. విడా ముయార్చి సంక్రాంతి రాబోతున్నట్లు ప్రకటించి కొన్ని కారణాల వలన వాయిదా పడింది. మగిల్ తిరుమేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష నటిస్తుంది. మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
“Acting & Racing are both physically & emotionally demanding jobs🤝. I hate Multitasking. So I will focus on one activity at a time🎯👏. I have 2 releases coming up, #VidaaMuyarchi on Jan & #GoodBadUgly on Summer🔥”
– #Ajithkumar pic.twitter.com/5H0ywVJ9Pr— AmuthaBharathi (@CinemaWithAB) January 11, 2025