కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సినిమా వస్తుందంటే చాలు అభిమానులు బాక్సాఫీస్ వద్ద సృష్టించబోయే రికార్డుల గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. ఈ ఏడాది తునివు ప్రాజెక్ట్‌తో మంచి హిట్టు కొట్టిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఏకే 62 (AK 62) వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
డెబ్యూ డైరెక్టర్ మేజిహ్ తిరుమెని దర్శకత్వంలో హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఏకే 62 రెగ్యులర్ షూటింగ్ మే నుంచి షురూ కానుందట. మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ను ఏప్రిల్‌లో అందించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో అరుణ్ విజయ్, అరుళ్‌నిధి కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వస్తుండగా.. వీటిని చిత్రయూనిట్ కొట్టిపారేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారు.. ఇతర పాత్రల్లో ఎవరెవరు నటించనున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
గాడ్ ఫాదర్ (చిరంజీవి) సినిమాకు పనిచేసిన నీరవ్ షా ఏకే 62కు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఏకే 62 అజిత్-నీరవ్ షా కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా. గతంలో నీరవ్ షా-అజిత్ కాంబినేషన్లో వచ్చిన పింక్ తమిళ రీమేక్, వలిమై, తునివు చిత్రాలు బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
Read Also :
Niharika Konidela | నెట్టింట్లోకి నిహారిక కలర్‌ఫుల్ రీఎంట్రీ.. పుకార్లపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
NTR 30 | ఎన్టీఆర్ 30 స్టన్నింగ్ అప్డేట్.. ఫస్ట్ యాక్షన్ సీన్ ఇదే