Multi Starrer | అజిత్ కుమార్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఏకే 64’ … లారెన్స్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో?
Multi Starrer | కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఏకే 64’ (AK 64) గురించి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్‌కి గణనీయమైన బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.
Multi Starrer | కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఏకే 64’ (AK 64) గురించి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్‌కి గణనీయమైన బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజిత్‌తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా కీలక పాత్రల్లో నటించబోతున్నారు. వారు విజయ్ సేతుపతి, రాఘవ లారెన్స్. అయితే ఈ ఇద్దరు విలన్లుగా నటిస్తారా? లేక అజిత్‌కు సపోర్ట్ చేసే శక్తివంతమైన పాత్రల్లో కనిపిస్తారా? అన్నది ఇంకా రహస్యంగానే ఉంచారు. సినీ వర్గాల ప్రకారం, వీరి రోల్స్ మల్టీ-డైమెన్షనల్‌గా ఉండనున్నాయని, కేవలం ప్రతినాయక పాత్రలుగా మాత్రమే కాకుండా కథలో ప్రధాన మలుపులకు కారణమవుతారని సమాచారం.
ఇప్పటికే ‘వాలిమై’, ‘వీర్మా’, ‘తునివు’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న అజిత్, ఈసారి మరింత స్టైలిష్, మాస్ మరియు ఎమోషనల్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రిప్ట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని అజిత్ స్వయంగా స్పష్టంచేశారు. ఈ చిత్రానికి దేశంలోని అగ్రశ్రేణి టెక్నీషియన్లు, యాక్షన్ మాస్టర్స్, కెమెరామెన్లు జట్టుకట్టినట్లు తెలుస్తోంది. అజిత్ ఈ సినిమాకి తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక రాఘవ లారెన్స్ ప్రస్తుతం ‘కాంచన 4’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకుంది. మరోవైపు విజయ్ సేతుపతి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో వరుసగా ప్రాజెక్టులు చేస్తూ దూసుకెళ్తున్నారు. ‘ఏకే 64’ లో అజిత్, విజయ్ సేతుపతి, రాఘవ లారెన్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఇది కోలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత క్రేజీ కాంబోగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

