Raid 2 Movie | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రైడ్ 2’. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాగా.. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించాడు. రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమాను పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఆదాయపు పన్ను విభాగంలో(Income Tax Department) సీనియర్ అధికారిగా పనిచేసే అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేస్తూ వారిని నిద్రలేకుండా చేస్తుంటాడు. అయితే, ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై ఐటీ దాడి చేయాలని అమయ్ పట్నాయక్‌కి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుతాయి. ఈ సందర్భంలో దాడి కోసం ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఏం సంభవించిందనేది ఈ సినిమా కథ.