Ajay Bhupathi | మళ్లీ ఆర్ఎక్స్100 జోనర్లోకి అజయ్ భూపతి.. మూడో సినిమా టైటిల్ ఇదే..!
చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఆర్ఎక్స్100 (RX100 Movie,). డైరెక్టర్‌గా అజయ్ భూపతి (Ajay Bhupathi)కి మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన రెండో సినిమా మహాసముద్రం.
చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఆర్ఎక్స్100 (RX100 Movie,). హీరోగా కార్తికేయకు, డైరెక్టర్‌గా అజయ్ భూపతి (Ajay Bhupathi)కి, హీరోయిన్గా పాయల్ రాజ్‌పుత్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి పిల్లా రా అంటూ సాగే పాటనైతే చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీఒక్కరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన రెండో సినిమా మహాసముద్రం.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫెయిల్యూర్ తెచ్చుకుంది. తాజాగా ఆర్ఎక్స్ 100 డైరెక్టర్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అజయ్ భూపతి మళ్లీ తన ఫేవరేట్ జోనర్లోకి రాబోతున్నాడట. ఆర్ఎక్స్ 100 లాంటి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ కథతో మూడో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
అంతేకాదు ఈ చిత్రానికి మంగళవారం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడని, అధికారిక ప్రకటన ఒకటే తరువాయి అని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అజయ్ భూపతి ఈ చిత్రానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తాడేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Read Also : Love Today Trailer | మా ఇంట్లో నేనేం చెప్తే అది.. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. లవ్ టుడే ట్రైలర్
Read Also : Ram Charan | రాంచరణ్ నయా జిమ్ చూశారా..? ఆర్సీ 15 కోసం వర్కవుట్స్ వీడియో
Read Also : Dhamki | ఫస్ట్ లుక్‌తోనే ధమ్కీ ఇస్తున్న విశ్వక్ సేన్.. ట్రెండింగ్‌లో పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

