Aishwarya Rai Bachchan | కేన్స్‌లో ఐశ్వర్య లుక్స్‌పై ట్రోల్స్.. డిజైనర్‌ని మార్చేయండి అంటూ కామెంట్స్
Aishwarya Rai Bachchan | చిత్రపరిశ్రమకు సంబంధించిన వేడుకలు అంటే చాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు. వేడుకలో భాగంగా తారలు ధరించే దుస్తులు, వారు వేసుకునే నగలపైనే అందరి చూపూ ఉంటుంది. ఇక స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) ఫ్యాషన్ (Fashion) లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Aishwarya Rai Bachchan | చిత్రపరిశ్రమకు సంబంధించిన వేడుకలు అంటే చాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు. వేడుకలో భాగంగా తారలు ధరించే దుస్తులు, వారు వేసుకునే నగలపైనే అందరి చూపూ ఉంటుంది. ఇక స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) ఫ్యాషన్ (Fashion) లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినీ వేడుకలోనైనా, ఫ్యాషన్ షోలోనైనా ఐష్ విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటుంది. ఇక ఏటా ఫ్రాన్స్ వేదికగా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)కు కొత్త కళ తెస్తుంటుంది ఐశ్వర్య. ఆమె రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకూంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్ (Aish)వైపే ఉంటాయి. అయితే, ఈ ఏడాది 21వ సారి కేన్స్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ అభిమానుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. తన లుక్స్ కారణంగా దారుణంగా ట్రోల్స్‌కు గురవుతోంది.
అసలేమైందంటే.. ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes 2023) బుధవారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ (Red Carpet)పై హొయలుపోతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు తారలు హాజరై ట్రెండీ దుస్తులు ధరించి అందరినీ ఆకర్షిస్తున్నారు. ఐశ్వర్య కూడా కొత్త కొత్త కాస్ట్యూమ్స్ ధరించి తళుక్కున మెరిసింది. ఇందులో భాంగా ఆమె ధరించిన వెండి గౌన్ నెటిజన్లను నిరాశకు గురిచేస్తోంది. ఈ వెండి హుడిపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘మీరు డిజైనర్‌ను మార్చండి’, ‘వెండి హుడీ ఏంటి విడ్డూరంగా’ అంటూ విమర్శించడం మొదలు పెట్టారు.
వెండి గౌనే కాదు.. ఐష్ హెయిర్‌స్టైల్‌పై కూడా నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కేన్స్ ఫ్మిల్ ఫెస్టివల్లో భాగంగా ఐష్ షైనీ మెటాలిక్ గ్రీన్ కలర్ డ్రెస్‌ను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇంత వరకూ బాగున్నా.. ఆ డ్రెస్‌లో ఐష్ వేసుకున్న హెయిర్‌స్టైలే (Hairstyle) అభిమానులకు నచ్చడం లేదు. ఐష్ హెయిర్‌స్టైల్‌పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
‘ఐష్ మీరు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. అయితే, దయచేసి మీ హెయిర్ స్టైల్ మార్చుకోండి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఎప్పుడూ ఇదే హెయిర్స్టైలేనా’ అంటూ మరొకరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మీ నుంచి కొత్త హెయిర్‌స్టైల్స్‌ను ఆశిస్తున్నా.. కానీ, మీరు మాత్రం సెంటర్ లైన్ హెయిర్ స్టైల్‌కు అతుక్కుపోయారు’, ‘హీల్స్, మేకప్ అంతా బాగుంది, కానీ హెయిర్ స్టైలే నచ్చడం లేదు.. మార్చండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Cannes 2023 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన బీటౌన్ తారలు
Italy floods | వరదలతో అతలాకుతలమవుతున్న ఇటలీ.. 13 మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

