ముంబై : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా అవుతుండగా మిడ్‌జర్నీ నుంచి చాట్‌జీపీటీ వరకూ సరికొత్త అడుగులు పడుతున్నాయి. ఏఐ ప్రపంచవ్యాప్తంగా క్రేజీ టెక్నాలజీగా ముందుకొస్తోంది. ఏఐ టెక్నాలజీ వాడటం ద్వారా సమకూరిన ఫలితాలను ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆర్టిస్టులు సోషల్ మీడియా వేదికగా (Viral Post ) షేర్ చేస్తున్నారు.
క్రికెటర్లను వయసు మళ్లినవారిగా ఊహిస్తూ వచ్చిన ఫొటోలు, సంపన్నులను పేదవారిగా చూపడం, సినీ నటులు వయసు మీరితే ఎలా ఉంటారనే ఊహా చిత్రాలు నెట్టింట సందడి చేశాయి. లేటెస్ట్గా సాహిద్ అనే ఆర్టిస్ట్ బాలీవుడ్ నటీమణులు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో వెల్లడించే ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను షేర్ చేశారు.
బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకోన్, అలియా భట్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కృతి సనన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా వంటి హీరోయిన్ల ఊహా చిత్రాలను షేర్ చేశారు. మిడ్‌జర్నీ యాప్‌ను ఉపయోగించి ఈ ఇమేజ్‌లను జనరేట్ చేశారు. ఆన్లైన్లో బాలీవుడ్ భామల వయసు మీరిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇవి వాస్తవానికి దూరంగా ఉన్నాయని కొందరు సోషల్ మీడియా యూజర్లు పెదవివిరిచారు. బాహ్య సౌందర్యం తాత్కాలికమని, ఆత్మ సౌందర్యం అనేది శాశ్వతమని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్ ఇది అన్రియల్ అంటూ రాసుకొచ్చారు.
Read More