నిన్న వేణు.. ఇప్పుడు వడ్డే నవీన్.. రీఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోలు
ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత వేణు తొట్టెంపూడి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో వడ్డే నవీన్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. వాళ్లు నటించింది తక్కువ సినిమాలే అయినా సరే.. ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అలాంటి హీరోల్లో వడ్డే నవీన్, వేణు తొట్టెంపూడి, తరుణ్ వంటి చాలామంది హీరోలు ఉన్నారు. ఒకప్పుడు మంచి హిట్లతో దూసుకెళ్లిన వీళ్లు కెరీర్ గాడి తప్పడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. వీరిలో ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత వేణు తొట్టెంపూడి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఇదే బాటలో వడ్డే నవీన్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
కోరుకున్న ప్రియుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వడ్డే నవీన్.. అంతకంటే ముందు నిర్మాతగా రెండు మూడు సినిమాలు చేశాడు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు ఈయన. దాంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఈజీగానే దొరికింది. దానికి తోడు తొలి సినిమా కోరుకున్న ప్రియుడు బాగానే ఆడింది. దాంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కోరుకున్న ప్రియుడు సినిమా కంటే ముందు క్రాంతి అనే మరో సినిమా కూడా చేశాడు ఈయన. తండ్రి రమేష్ నిర్మాణంలోనే ఇది వచ్చింది. అయితే అది విడుదల కాలేదు. ఆ తర్వాత 1997లో కోరుకున్న ప్రియుడు విడుదలైంది. అదే ఏడాది కోడి రామకృష్ణ తెరకెక్కించిన పెళ్లి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వడ్డే నవీన్. ఈ సినిమాకు రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్, ఒక నంది అవార్డు వచ్చింది. 1991లో వచ్చిన హాలీవుడ్ సినిమా స్లీపింగ్ విత్ ద ఎనిమి ఆధారంగా పెళ్లి సినిమా తెరకెక్కించాడు కోడి రామకృష్ణ. ఇది బ్లాక్ బస్టర్ కావడంతో వడ్డే నవీన్ ఒక్కసారిగా క్రేజీ హీరో అయిపోయాడు.
అదే ఏడాది ప్రియా ఓ ప్రియా సినిమాలోనూ కనిపించాడు. కానీ ఇది అంచనాలు అందుకోలేదు. ఆ వెంటనే వరుసగా సినిమాలు చేశాడు నవీన్. అందులో మనసిచ్చి చూడు, మా బాలాజీ, చాలా బాగుంది లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం అందుకున్నాయి. మిలియన్ హీరోలలో వడ్డే నవీన్ అందరికంటే ముందున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. ఆయన సినిమాలు వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయాయి. దాంతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు వడ్డే నవీన్. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒక టాప్ హీరో సినిమాలో వడ్డే నవీన్ కీలకపాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకమైన లుక్ కూడా మెయింటెన్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. మొత్తానికి నవీన్ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

