నాని మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది.. ఇదిలాగే కంటిన్యూ అయితే..

నాని చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న కథలు చూసిన తర్వాత ఇదే మాట అంటున్నారు అభిమానులు. ఒకప్పుడు నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ముద్ర ఉండేది. ఎలా ఉన్నా కూడా నాని ఉన్నాడులే ఓ సారి చూడొచ్చు అనే వాళ్లు. కానీ ఇప్పుడు అభిమానులకు నాని ఎంచుకుంటున్న కథల్లోనే లోపాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆయన సినిమాలు ఇప్పుడు వరుసగా నిరాశ పరుస్తున్నాయి. మొన్న వినాయక చవితి కానుకగా నేరుగా డిజిటల్లో విడుదలైన టక్ జగదీష్ సినిమా చూసిన తర్వాత నాని ఫ్యాన్స్ అయ్యో అంటూ నిట్టూర్చారు. ఎన్నో సినిమాల్లో వాడేసిన కథనే మరోసారి ఫ్రెష్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ.
2017 వరకు వరుస విజయాలతో దుమ్ము దులిపేసిన నాని.. కృష్ణార్జున యుద్ధం తర్వాత గాడి తప్పాడు. అప్పట్నుంచి ఈయన చేసిన సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. మధ్యలో జెర్సీ మాత్రమే అంచనాలు అందుకుంది. కానీ గ్యాంగ్ లీడర్, వి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు విడుదలైన టక్ జగదీష్ కూడా అంచనాలు అందుకోలేదనే చెప్పాలి. ఈయన ఇప్పుడు సీనియర్ దర్శకులకు కాకుండా కుర్ర దర్శకులకే ఎక్కువ ఆఫర్స్ ఇస్తున్నాడు. కొత్త కథల వైపు అడుగులేస్తున్నాడు. ముఖ్యంగా వి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నానిలో మార్పు వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ శివ నిర్వాణతో మరోసారి రొటీన్ కథతోనే టక్ జగదీష్ సినిమా చేశాడు.
తాజాగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఇదిలా ఉండగానే ఇప్పుడు వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్లో నాని చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ సెట్ అయింది. ఇప్పుడు విడుదలైన అంటే సుందరానికి కర్టెన్ రైజర్ చూస్తుంటే కచ్చితంగా సినిమా హిట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ టీజర్ చూసిన తర్వాత 100 శాతం నవ్వులు గ్యారెంటీ అని అర్థమైపోయింది. ఇప్పటి వరకు అయిందేదో అయిపోయింది.. ఇకపై అయినా కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవా నాని అంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Krishnam Raju: కృష్ణం రాజుకి ప్రమాదం.. అపోలోలో చికిత్స..!
Mallika Sherawat | తండ్రి పేరు చెప్పని మల్లికాశెరావత్..కారణమిదే..!
Naga Chaitanya: సమంతకి థ్యాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైన పుకార్లకి ఫుల్స్టాప్ పడ్డట్టేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

