పవన్ కళ్యాణ్ స్పీచ్ | ఇండస్ట్రీలో వేడి రాజుకుంది.. నాని ముందుకొచ్చాడు..

Nani reaction on Pawan kalyan speech | రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ (మాట్లాడిన మాటలు ఇప్పుడు ఓ రేంజ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిని ఓ పట్టాన ఎవరు మరిచిపోలేకపోతున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంతో కనిపించాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు గురైనప్పుడు మీడియా ప్రవర్తించిన తీరుపై కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. దాదాపు గంట సేపు మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మొదటి పది నిమిషాలు మాత్రమే సాయి ధరమ్ తేజ్ గురించి చర్చించాడు. మిగిలిన 45 నిమిషాలు సినిమా ఇండస్ట్రీ కష్టాలతో పాటు ఏపీలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఓపెన్ అయ్యాడు. పవర్ లేని తనను పవర్ స్టార్ అని పిలవద్దు అంటూ చమత్కరించారు కూడా.
ఇండస్ట్రీ సమస్యల గురించి సీరియస్‌గా డిస్కస్ చేశాడు పవన్ కళ్యాణ్. ఈయన ఇంత తీవ్ర స్థాయిలో మాట్లాడిన తర్వాత కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు బయటకు రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ధైర్యం మిగిలిన హీరోలకు ఎందుకు లేదు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాని ముందుకొచ్చాడు. నిజానికి పవన్ కళ్యాణ్ స్పీచ్‌లో నాని పేరు కూడా వచ్చింది. ఈ మధ్యే థియేటర్ యాజమాన్యం నాచురల్ స్టార్ నానిని టార్గెట్ చేయడంపై మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఏపీలో థియేటర్స్ లేనప్పుడు.. తన సినిమాను విడుదల చేసుకోవడానికి మరో గత్యంతరం లేక ఓటీటీ వైపు ఆ కుర్రాడు వెళ్లాడు.. అందులో తప్పేముంది.. దానికి నానిని ఎందుకు తప్పు పడుతున్నారు.. ధైర్యం ఉంటే వెళ్లి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు.
ఇప్పుడు ఇదే విషయంపై నాని కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. తనకు సపోర్ట్ చేసినందుకు ముందుగా పవన్ కళ్యాణ్‌కు థాంక్యూ చెప్పాడు నాచురల్ స్టార్. చాలా రోజుల నుంచి తాను కూడా ఇదే చెబుతున్నానని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా నాని సూచించాడు. గతంలోనూ థియేటర్స్ విషయంలో నాని మాత్రమే గళం విప్పాడు. ఇప్పుడు పవన్ కూడా ముందుకు రావడంతో ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరైనా ఈ విషయంపై మాట్లాడతారా అని నిర్మాతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి పెద్ద సినిమాలు విడుదల కాకుండా అలాగే ఆపేశారు. ఏపీలో థియేటర్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ అయి.. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తే త్వరలోనే మళ్లీ పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. ఆరోజు కోసమే అందరూ వేచి చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రసంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?
Mohanbabu | నువ్వడిగిన ప్రతీ మాటకు సమాధానమిస్తా: పవన్ స్పీచ్ పై మోహన్ బాబు
పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇండస్ట్రీకి లాభమా.. నష్టమా..?
Nagarjuna: హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పాలంటూ హౌజ్‌మేట్స్‌కి నాగ్ ప్రశ్న
Most Eligible Bachelor | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కుటుంబం ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

