ఇద్దరు మాజీ ప్రేమికుల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’. అడివి శేషు, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రధారులు. షానీల్ డియో దర్శకుడు. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ద్వారా మేకర్స్ ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
ప్రేక్షకులు బిగ్స్క్రీన్పై ఎన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూస్తారని అడివిశేషు చెప్పారు. షానీల్ డియో విజన్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని, దేశంలోని అరుదైన ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాల నేపథ్యంలో సరికొత్త అనుభూతిని పంచేలా బరువైన పాత్రలతో ైస్టెలిష్ ఎంటర్టైనర్గా షానిల్ డియో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అడివిశేషు అన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.