Adipurush | ఆదిపురుష్ ఫీవర్.. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2వేలకు పైనే
Adipurush | మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రేమికులే కాదు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Adipurush | మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ (Adipurush)
సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రేమికులే కాదు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. థియేటర్లు నిండుగా కనిపించి దాదాపు రెండు నెలలయింది. ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్లు ఆదిపురుష్ తో కలకళలాడబోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో విపరీతమైన బజ్ ఏర్పడింది. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ పౌరాణిక ఇతిహాసాన్ని పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్లు హాట్ టాపిక్ గా మారాయి. దేశ రాజధాని ఢిల్లీ , ఎన్సీఆర్లో టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుక్ మై షో ప్రకారం.. పీవీఆర్, యాంబియన్స్ వంటి పెద్ద పెద్ద మాల్స్ లో ‘ఆదిపురుష్’ 2డీ ఫార్మాట్ హిందీ వర్షెన్ టికెట్ ధర రూ.2,200 గా ఉంది. ఇది కాకుండా, పీవీఆర్ : వేగాస్, ద్వారక వంటి థియేటర్లలో ఒక్కో టికెట్ ధర రూ.2,000గా ఉంది.
మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఓంరౌత్ దర్శకుడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇక ఇప్పటికే అభిషేక్ అగర్వాల్, రణ్ బీర్ కపూర్, మంచు మనోజ్ ఫ్యామిలీ ఇలా పలువురు అనాధ పిల్లల కోసం ఉచితంగా టిక్కెట్లు స్పాన్సర్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Shah Rukh Khan | షారుక్ బుగ్గపై ముద్దుపెట్టిన లేడీ ఫ్యాన్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

