Adhurs Movie Re-Release | జూ.ఎన్టీఆర్ సినిమాల్లో అదుర్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తారక్ కెరీర్లో ఎన్ని బ్లాక్బస్టర్లు, వందల కోట్లు వసూల్ చేసిన సినిమాలున్నా.. అదుర్స్ మూవీ ఎప్పటికీ స్పెషల్. ముఖ్యంగా బ్రాహ్మణుడిగా తారక్ నటన వర్ణనాతీతం. ఇక గురు శిశ్యులుగా బ్రహ్మీ,తారక్ మధ్య పండిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో వీరిద్ధరి ఎక్స్ప్రెషన్లు మీమ్స్ రూపంలో రోజు వందల సార్లు చూస్తుంటాం. వీరిద్దరే అని కాదు, సినిమాలో ప్రతీ పాత్ర మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేసింది. వివి వినాయక్ మార్క్ యాక్షన్‌తో పాటు ఫ్రెష్ కామెడీ, కిక్కిచ్చే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇలా ప్రతీది ఒక మాస్ ప్యాకేజిలా అనిపిస్తుంది.
కాగా ఈ సినిమా మళ్లీ థియేటర్లోకి రాబోతుంది. మార్చి 4న ఫోర్ కె ప్రింట్‌తో అదుర్స్ మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రీ-రిలీజ్‌కు సంబంధించిన పనులు కూడా స్టార్ అయిపోయాయి. కాగా మార్చి తొలివారంలో చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. దాంతో అదుర్స్‌కు మంచి కలెక్షన్లు వచ్చే చాన్స్ ఉంది. ఇక గతంలో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందంటూ ప్రచారం వచ్చినా.. వివి వినాయక్ ఆసక్తి కనబరచలేదని సమాచారం. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.