నేటితరం కథానాయికలు ఎలాంటి సవాళ్లకైనా సిద్ధం అంటున్నారు. అందం, అభినయానికి మాత్రమే పరిమితమైపోకుండా హీరోలతో సమానంగా యాక్షన్ ఘట్టాల్లో సత్తా చాటాలని తపిస్తున్నారు. తాజాగా అదాశర్మ ఓ అంతర్జాతీయ సినిమా కోసం కత్తిసాములో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నదట. కరవాలం చేతబూని తాను చేసే యాక్షన్ విన్యాసాలు సినిమాలో హైలైట్గా ఉండబోతున్నాయని చెప్పింది. ఆమె మాట్లాడు తూ ‘యాక్షన్ ప్రధానంగా నా పాత్ర సాగుతుంది.
కత్తిసాము నేపథ్యంలో భారీ సీక్వెన్స్లుంటాయి. వాటిలో సహజంగా కనిపించాలని కత్తిసాములో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. కత్తిని ఒడుపుగా తిప్పుతూ శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. నా కెరీర్లో ఇదో సరికొత్త అనుభవం. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని త్వరలోవెల్లడిస్తా’ అని చెప్పింది. ‘హార్ట్ఎటాక్’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘కల్కి’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందీ భామ.