నటి షాలూ చౌరాసియాపై దాడి

- కేబీఆర్ పార్కు బయట వాక్‌వేలో ఘటన
బంజారాహిల్స్, నవంబర్ 15: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు బయట వాకింగ్‌కు వచ్చిన సినీనటి షాలూ చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడడంతో పాటు సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో వాకింగ్ చేస్తున్న షాలూను కొంతదూరం అనుసరించిన దుండగుడు..జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని స్టార్‌బక్స్ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం వద్ద దాడి చేశాడు. కేకలు పెట్టకుండా నోటికి గుడ్డలు అడ్డుపెట్టి.. పక్కనే ఉన్న బండరాయికి అదిమిపెట్టాడు. బంగారం.. నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చౌరాసియాకు గాయాలయ్యాయి. ఆమె చేతిలోని సెల్‌ఫోన్ లాక్కున్న దుండగుడు.. బండరాయి తలపై వేసేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించి.. పక్కనే ఉన్న గేటు వైపు పరిగెత్తింది. స్టార్ బక్స్ వద్ద పనిచేస్తున్న కొందరు డ్రైవర్ల సాయంతో జరిగిన విషయాన్ని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయగా, బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్టార్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన అనంతరం షాలూ రాత్రి 11.30 సమయంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేవలం ఆభరణాలు, సెల్‌ఫోన్ కోసమే దాడికి పాల్పడ్డాడా..లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

