Actress Sangeetha | సీనియర్ నటి సంగీత, ఆమె భర్త, సింగర్ క్రిష్ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై నటి సంగీత స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఈ సందర్భంగా తన భర్త క్రిష్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియా వేదిక పంచుకుంది. గతంలో సంగీత తన ఇన్స్టాగ్రామ్ బయోలో సంగీత క్రిష్ (Sangeetha Krish) అని ఉన్న పేరును సంగీతగా మార్చడంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ మేము బాగానే ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సినిమాల విషయానికి వస్తే.. ఆచర్య, మసూద, వారసుడు తదితర చిత్రాలతో ఇటీవల ప్రేక్షకులను అలరించింది ఈ భామ.