Heroine sadha Cries In Theater | టాలీవుడ్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘జయం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతికాలంలోనే స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. జయం సినిమాలోని ‘వెళ్ళవయ్యా వెళ్ళు’ అంటూ వచ్చే డైలాగ్ ప్రేక్షకులలో ఆల్ టైం ఫేవరెట్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా తమిళ వెర్షన్లోనూ సదానే హీరోయిన్గా నటించింది. ఇక విక్రమ్ ‘అపరిచితుడు’ సినిమాతో ఒక్క సారిగా ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. కాగా ప్రస్తుతం ఈమె తెలుగులో ఓ సినిమా చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈమె థియేటర్లో సినిమా చూస్తూ కన్నీరు పెట్టుకుంది,
ఇటీవలే విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన మేజర్ చిత్రాన్ని చూస్తూ భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలోనే థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సదా మాట్లాడుతూ ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబైలోనే ఉన్నానని, సినిమా చూస్తుంటే ఆరోజులు గుర్తుకువచ్చాయిని తెలిపింది. ఈ చిత్రంలో అడివిశేష్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు కురిపించింది. సినిమా చూస్తున్న సేపు గూస్బంప్స్ వచ్చాయని వీడియోలో వెల్లడించింది.