ఆ స్టార్ హీరోయిన్ను లొకేషన్లో చెల్లి అని పిలిచిన విక్రమ్
అపరిచితుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను గుర్తుచేసుకుంది సదా. షూటింగ్ సమయంలో విక్రమ్ తనను చెల్లె అని పిలిచేవాడని చెప్పింది.

వెళ్లవయ్యా.. వెళ్లు.. అనే డైలాగ్ చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేస్తుంది సదా. 19 ఏళ్ల క్రితం వచ్చిన జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సదా.. ఈ ఒక్క సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో చాలా సినిమాలే చేసింది. కానీ జయం, అపరిచితుడు సినిమాలకు వచ్చినంత పేరు మాత్రం సంపాదించుకోలేకపోయింది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న సదా.. జయం, అపరిచితుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను గుర్తుచేసుకుంది. అపరిచితుడు షూటింగ్ సమయంలో విక్రమ్ తనను చెల్లె ( తంగచ్చి ) అని పిలిచేవాడని బయటపెట్టింది.

అపరిచితుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో లొకేషన్‌కు వచ్చిన విక్రమ్.. తనను చెల్లె అని పిలుస్తుంటే అందరం షాకయ్యామని చెప్పుకొచ్చింది. ఇది విన్న విక్రమ్ పరిగెత్తుకువచ్చి.. మిమ్మల్ని తెరపై సీతారాముళ్లలా చూపిద్దాం అనుకుంటే.. మీరేమో అన్నా చెల్లి అనుకుంటున్నారు. మీ అన్నా చెల్లెళ్ల బంధం గురించి బయట లీకైతే నా సినిమా చూడటానికి ఎవరూ రారు అని సరదాగా అన్నారని ఆనాటి సంఘటనలను సదా గుర్తు చేసుకుంది. హీరోయిన్ లతో విక్రమ్ ఎంత మర్యాదగా ఉంటాడు అని చెప్పడానికి ఒక సంఘటన చాలు. ప్రస్తుతం విక్రమ్ కోబ్రా సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. మరోవైపు సదా బుల్లితెరపై బిజీగా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్
క్రికెటర్‌తో కూతురు పెళ్లి చేయబోతున్న డైరెక్టర్ శంకర్
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
చిరంజీవి సినిమాపై ఈ కన్ఫ్యూజన్ ఇంకెన్ని రోజులో.. ?
మాస్ట్రో : ఓటీటీలో నితిన్ సినిమా ?
19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aparichitudu
- Sada
- Tollywood
- Vikram
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

