తెలంగాణ సింగరేణి నేపథ్య కథాంశంతో తెరకెక్కిస్తున్న ‘దసరా’ చిత్రంలో కథానాయిక కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో సందడి చేయబోతున్నది. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం కథానాయిక కీర్తి సురేష్ జన్మదినం సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందు లో కీర్తి సురేష్ కొత్త పెళ్లి కూతురుగా ముస్తాబై హుషారుగా చిందేస్తూ కనిపిస్తున్నది.
అచ్చమైన తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్ పాత్ర సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.