Actor Venu’s father passes away | ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్దాప్యానికి సంబంధించి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు.
తొట్టెంపూడి వెంకట సుబ్బారావు మరణ వార్తను తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, వేణు అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. ఇక భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటల వరకూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంచనున్నట్లు.. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.