Simran | ఆయన లేని నా సినీ ప్రయాణం ఊహించుకోలేను.. నటి సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్
Simran | నటి సిమ్రాన్ (Simran) మేనేజర్ ఎం.కామరాజన్ (M Kamarajan) అనారోగ్యంతో మరణించారు (managers death). దాదాపు 25 ఏళ్లుగా నటి దగ్గర పనిచేసిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిమ్రాన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేనంటూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది.
Simran | నటి సిమ్రాన్ (Simran).. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున ఇలా దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. అడపాదడపా సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తెలుగు అభిమానులకూ టచ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సిమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ (emotional note) పెట్టింది.
సిమ్రాన్ మేనేజర్ ఎం.కామరాజన్ (M Kamarajan) అనారోగ్యంతో మరణించారు (managers death). దాదాపు 25 ఏళ్లుగా నటి దగ్గర పనిచేసిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిమ్రాన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేనంటూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టింది.
‘నమ్మలేకపోతున్నా. దిగ్భ్రాంతికరమైన వార్త. నా ప్రియమైన స్నేహితుడు ఎం. కామరాజన్ ఇక లేరు. 25 ఏళ్లుగా నా కుడి భుజంగా ఉన్నారు. నా ఎదుగుదలకు ఓ పిల్లర్‌లా నిలబడ్డారు. చాలా చురుకైన వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ.. ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారు. నమ్మకంగా పనిచేసేవారు. మీరు లేకుండా నా సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేను. ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం. చాలా త్వరగా వెళ్లిపోయారు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం నటి పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామరాజన్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
Also Read..
Group 1 Notification | ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. జనవరి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ
KCR | కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని.. ప్రజలకు సేవ చేయాలి: పవన్ కల్యాణ్
Bullet train station | దేశంలో తొలి బుల్లెట్ రైలు స్టేషన్ ఇదే.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

