నాని సినిమాలకు అది శాపంగా మారబోతుందా..?

తెలుగు ఇండస్ట్రీలో మీడియం బడ్జెట్ సినిమాలకు పెద్ద దిక్కు నాని. 20 కోట్ల బడ్జెట్ పెడితే 40 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సత్తా ఆయన సొంతం. రెండేళ్ల కింద వరకు ఈయన వరుస విజయాలతో దుమ్ము దులిపేశాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ మొదలైన తర్వాత నాని సినిమాలు వరుసగా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. గతేడాది వి.. మొన్న టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకు దాదాపు 35 కోట్లకు పైగానే చెల్లించింది అమెజాన్ కంపెనీ.
ఒకవేళ థియేటర్లలో విడుదలై ఉంటే కచ్చితంగా ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యేవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఇలాంటి సమయంలో ఈయన తర్వాత సినిమాలపై ఆ ప్రభావం ఖచ్చితంగా పడటం ఖాయంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నాని నటిస్తున్న తర్వాత సినిమాలు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ముందు సినిమాలకు ఊహించిన టాక్ రాకపోవడంతో రాబోయే సినిమాల థియేట్రికల్ బిజినెస్‌పై ప్రభావం పడటం ఖాయం. నాని ప్రస్తుతం శ్యామ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పుడు అంత బిజినెస్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంటే సుందరానికి సినిమా కూడా దాదాపు పాతిక కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నాని గత పరాజయాలు రాబోయే సినిమాలకు శాపంగా మారే ప్రమాదం లేకపోలేదు. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడితే తప్ప ప్రస్తుతం నాని ఉన్న పరిస్థితులు మెరుగు పడవు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

