Actor | శబరిమల బంగారం దోపిడీ కేసు .. విచారణలోకి సెలబ్రిటీలు.. నటుడు జయరామ్‌కు సిట్ నోటీసులు
Actor | శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన బంగారం దోపిడీ కేసు రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో తాజాగా పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారన్న అనుమానాలు బలపడటంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత విస్తరించింది.
Actor | శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన బంగారం దోపిడీ కేసు రోజు రోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో తాజాగా పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారన్న అనుమానాలు బలపడటంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత విస్తరించింది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు జయరామ్ పేరు వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసులో భాగంగా శుక్రవారం సిట్ అధికారులు చెన్నైలోని నటుడు జయరామ్ నివాసానికి వెళ్లి ఆయన నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆలయానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, పూజలపై గతంలో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక పూజలో బంగారం పూత ఉన్న రాగి పలకలు ఉపయోగించారన్న వార్తలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఆ అంశాలపై స్పష్టత కోసమే అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్ని కృష్ణన్ పొట్టితో జయరామ్‌కు ఉన్న పరిచయం కూడా విచారణలో కీలకంగా మారింది. వీరిద్దరూ కలిసి ఎప్పుడు, ఎక్కడ పూజలు నిర్వహించారు? ఆ కార్యక్రమాల్లో ఉపయోగించిన వస్తువులు ఏవి? వాటికి సంబంధించిన లావాదేవీలు ఏవైనా జరిగాయా? అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలయానికి సంబంధించిన పూజా వస్తువులు ప్రైవేట్ కార్యక్రమాల్లో ఉపయోగించారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
అధికారుల ప్రకారం, 2019లో చెన్నైలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఇటీవల బయటకు రావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ కార్యక్రమాన్ని ఉన్ని కృష్ణన్ పొట్టి నిర్వహించారని, అందులో శబరిమల ఆలయం నుంచి తీసుకువచ్చిన కొన్ని బంగారం పూత ఉన్న వస్తువులను పూజల్లో ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వీడియోలే ప్రస్తుతం సిట్ విచారణకు కీలక ఆధారాలుగా మారినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రెండు ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకటి, శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహం నుంచి బంగారం కొట్టేశారా? రెండవది, శ్రీకోవిల్ తలుపుల వద్ద ఉన్న బంగారం మాయమైందా? అనే అంశాలపై విస్తృతంగా విచారణ కొనసాగుతోంది. ఈ రెండు ఘటనలతో సంబంధం ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులు, పూజా కార్యక్రమాల నిర్వాహకులపై సిట్ నిఘా పెంచింది.
ఇప్పటికే ఈ బంగారం దోపిడీ కేసులో 12 మందిని అరెస్టు చేసిన అధికారులు, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సంకేతాలు ఇస్తున్నారు. విచారణ పూర్తయ్యాక మరిన్ని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. శబరిమల వంటి అత్యంత పవిత్రమైన ఆలయానికి సంబంధించిన ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

