టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూశాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యం కారణంగా బాధ పడుతున్న చౌదరి కర్ణాటకలోని రాయచూర్‌లో ప్రైవేట్ హస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయన మృతి పట్లు పులువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బహుబాషా నటుడైన చౌదరి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 100కు పైగా సినిమాలలో నటించాడు. ఈయన వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించాడు.
‘సాహో’, ‘వైల్డ్ డాగ్’, ‘టచ్ చేసి చూడు’ వంటి సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చలపతి చౌదరి ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించాడు. తర్వాత కర్ణాటకలోని రాయచూర్‌లో స్థిరపడిపోయాడు. ఈయనకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు కాలిఫోర్నియాలో డాక్టర్‌గా అక్కడే సెట్టిల్ అయింది. కొడుకు శ్రీనివాస్ చౌదరి పలు సీరియల్స్‌లో నటించాడు. లేటెస్ట్గా చలపతి చౌదరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీలో కనిపించాడు.