Abhinav Shukla | సల్మాన్ ఇంటిపై జరిపినట్లు మీ నివాసంపై కాల్పులు జరుపుతాం.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో నటుడికి బెదిరింపులు
Abhinav Shukla | బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు (death threat) వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ గ్యాంగ్ నుంచి మరో నటుడికి ఇలాంటి బెదిరింపులే రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
Abhinav Shukla | బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు (death threat) వస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్‌ను చంపేస్తామంటూ వరుస బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ గ్యాంగ్ నుంచి మరో నటుడికి ఇలాంటి బెదిరింపులే రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తనకు హత్య బెదిరింపులు వచ్చినట్లు బాలీవుడ్ నటుడు అభివన్ శుక్లా (Abhinav Shukla) తాజాగా తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడి వివరాలను కూడా శుక్తా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చి బెదిరింపు సందేశాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ‘నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిని. నాకు మీ ఇంటి అడ్రెస్ తెలుసు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే మీ ఇంటిపై కూడా జరుపుతాం. ఇదే మీకు చివరి హెచ్చరిక. అసిమ్ గురించి గౌరవంగా మాట్లాడండి. లేదంటే బిష్ణోయ్ గ్యాంగ్ లిస్ట్‌లో మీ పేరు చేరుతుంది’ అని ఉంది. ఆ పోస్ట్‌ను పంజాబ్, చండీగఢ్ పోలీసులకు శుక్లా ట్యాగ్ చేశారు. అతడి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
కాగా, అభినవ్ శుక్లా భార్య రుబీనా (Rubina)కు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అసిమ్ రియాజ్ (Asim Riaz)కు మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసిమ్‌పై అభినవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అసిమ్ అభిమానులు ఈ హీరోకు బెదిరింపులు పంపుతున్నారు. తాజాగా వచ్చిన సందేశం కూడా అతడి అభిమానులే పంపినట్లు అభినవ్ ఆరోపించారు.
DEATH THREATS to my family ! @DGPPunjabPolice @PunjabPoliceInd @DgpChdPolice @ChdPol. Person seems to be from Chandigarh / Mohali . Please act firmly & promptly. To anyone who recognises the person plz report to @DGPPunjabPolice pic.twitter.com/XLkktoYUXa
— Abhinav Shukla (@ashukla09) April 20, 2025
Also Read..
Samantha | సమంత అంత మాట అనేసింది ఏంటి.. అవి చూస్తుంటే సిగ్గేస్తుందంటూ కామెంట్
Rahul Gandhi | భారత్‌లో ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్ గాంధీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

