సునీతపై అసభ్యకరమైన పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సింగర్
సెలబ్రెటీలపై సోషల్మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం ఇటీవల కొంతమంది ఆకతాయిలకు అలవాటైపోయింది. తాజాగా సింగర్ సునీతపై కూడా ఓ నెటిజన్ దారుణమైన కామెంట్ పెట్టాడు.

సెలబ్రెటీలపై సోషల్మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం ఇటీవల కొంతమంది ఆకతాయిలకు అలవాటైపోయింది. ఇలా పెట్టిన కామెంట్లపై కొంతమంది సెలబ్రెటీలు పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తూనే ఉన్నారు. అయినా ఈ కామెంట్లు మాత్రం ఆగడం లేదు. తాజాగా సింగర్ సునీతపై కూడా ఓ నెటిజన్ దారుణమైన కామెంట్ పెట్టాడు.

ఇటీవల తన భర్త రామ్ వీరపనేనితో దిగిన ఒక ఫొటోను సింగర్ సునీత ఫేస్బుక్లో షేర్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ దారుణమైన కామెంట్ పెట్టాడు. సునీత, రామ్ వీరపనేని ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఉన్న ఈ ఫోటోను చూసి గ్రాండ్ ఫాదర్ అండ్ ఆంటీ అంటూ వెక్కిరిస్తూ కామెంట్ చేశాడు. దీంతో సదరు ఆకతాయిపై సునీత ఫైర్ అయింది. ఘాటుగా రిప్లై ఇచ్చింది. గాడ్ బ్లెస్ యు నాన్న.. బుర్ర మాత్రమే కాదు నువ్వు మనిషిగా కూడా ఎదగాలి.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను చూస్తుంటే జాలిగా ఉంది.. ఎదుటి వ్యక్తులను నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో అర్థమవుతుంది.. నీకు నేర్పించిన సంస్కారానికి నమస్కారాలు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సునీత. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రిలో కత్తి మహేశ్ .. చికిత్సకు ఏపీ సీఎం జగన్ భారీ ఆర్థికసాయం
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
టాలీవుడ్ టాక్..మేం కూడా వారసులమే అంటున్న కూతుళ్లు..!
ఆఫర్ల కోసం చూస్తున్న మాధురీదీక్షిత్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

