అభయ్ బేతిగంటి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రామన్న యూత్’. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజనీ నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. ‘ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసిన ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే చిత్ర కథాంశం. వినోదంతో పాటు సమకాలీన సామాజిక సమస్యల్ని చర్చిస్తున్నాం. లీడర్ రాజు పాత్రలో అభయ్ బేతిగంటి కనిపిస్తారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత అన్నారు. అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి బజర్దస్త్, యాదమ్మ రాజు, అమూల్య రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఫహార్ అబ్దుల్ మజీద్, సంగీతం: కమ్రాన్, రచన-దర్శకత్వం: అభయ్ బేతిగంటి.