Aarya | మళ్లీ వస్తున్న ‘ఆర్య’.. అల్లు అర్జున్ ఐకానిక్ క్యారెక్టర్‌తో యానిమేషన్ మూవీ!
Aarya | టాలీవుడ్లో ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పిన చిత్రాల్లో ‘ఆర్య’ ఒకటి. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, హీరో, దర్శకుడు ఇద్దరి కెరీర్లకు కీలక మలుపుగా నిలిచింది. ముఖ్యంగా ‘ఆర్య’ అనే పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
Aarya | టాలీవుడ్లో ప్రేమకథలకు కొత్త నిర్వచనం చెప్పిన చిత్రాల్లో ‘ఆర్య’ ఒకటి. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, హీరో, దర్శకుడు ఇద్దరి కెరీర్లకు కీలక మలుపుగా నిలిచింది. ముఖ్యంగా ‘ఆర్య’ అనే పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు అదే ఐకానిక్ క్యారెక్టర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈసారి ‘ఆర్య’ సాధారణ సినిమాగా కాకుండా యానిమేషన్ రూపంలో ప్రేక్షకులను అలరించబోతోందని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ‘ఆర్య’ సినిమాలోని ప్రధాన పాత్రను ఆధారంగా చేసుకుని ఓ ప్రత్యేక యానిమేషన్ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో పూర్తి సినిమా కథను తిరిగి చెప్పడం కాకుండా, ‘ఆర్య’ పాత్రలోని ప్రత్యేకత, ఆలోచనా విధానం, ప్రేమ తత్వం, సరదా స్వభావం వంటి అంశాలను ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడు సుకుమార్ ఈ యానిమేషన్ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ‘ఆర్య’ పాత్ర రూపకల్పనలో ఆయన స్వయంగా పాల్గొంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్య’ తమ కెరీర్లో ఎంత ముఖ్యమైన చిత్రమో గుర్తుంచుకుని, ఈ యానిమేషన్ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ యానిమేషన్ చిత్రాన్ని కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసే ప్రణాళికలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో, అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నారని సమాచారం. 2004లో విడుదలైన ‘ఆర్య’ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. సినిమాలోని ప్రేమ కథ, సంభాషణలు, పాటలు, ముఖ్యంగా ‘ఆర్య’ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఆ పాత్రకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇప్పుడు అదే పాత్ర యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన, నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

