Aaradugula Bullet | ఫస్ట్ వీకెండ్లో కోటి కూడా రాని ‘ఆరడుగుల బుల్లెట్’..!
సీనియర్ దర్శకుడు బి.గోపాల్ (B Gopal) డైరెక్షన్ చేసిన ఆరడుగుల బుల్లెట్ (Aaradugula Bullet) కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. మరీ ముఖ్యంగా హీరో గోపీచంద్ (Gopichand) సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడు.

ఐదేళ్ల కింద విడుదల కావాల్సిన ఆరడుగుల బుల్లెట్ (Aaradugula Bullet) సినిమా ఎట్టకేలకు అక్టోబరు 8న విడుదలైంది. ఎన్నో అవాంతరాలు దాటుకుని..మరెన్నో ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు అన్ని సహించి భరించి థియేటర్లలో విడుదలైంది. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ (B Gopal) డైరెక్షన్ చేసిన ఈ సినిమా కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఆరడుగుల బుల్లెట్ థియేటర్ లో వస్తుంది అని టీవీలో ఎంత ప్రమోట్ చేసిన కూడా ప్రేక్షకులు నమ్మలేదు.
ప్రతీసారి ఇలాగే చెప్తారు లే అంటూ లైట్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా హీరో గోపీచంద్ (Gopichand) సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఐదేళ్ల కిందట సినిమాను తాను ఇప్పుడు ప్రమోట్ చేసిన కూడా లాభం లేదు అని ముందుగానే ఫిక్స్ అయిపోయాడు గోపీచంద్. దాని ఫలితం గోపీచంద్, నయనతార (Nayanthara) లాంటి స్టార్స్ సినిమాలో ఉన్న కూడా కనీసం ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడలేదు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి.
ప్రాంతాల వారీగా..
నైజాం: 0.26 కోట్లు
సీడెడ్: 0.17 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.13 కోట్లు
ఈస్ట్: 0.11 కోట్లు
వెస్ట్: 0.07 కోట్లు
గుంటూరు: 0.07 కోట్లు
కృష్ణా: 0.08 కోట్లు
నెల్లూరు: 0.05 కోట్లు
ఏపీ + తెలంగాణ: 0.94 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.05 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 0.99 కోట్లు షేర్
ఈ సినిమాకు రూ.2.95 కోట్ల బిజినెస్ జరిగింది. మరీ పాత సినిమా కావడంతో ప్రేక్షకులకు కనీసం ఆరడుగుల బుల్లెట్ సినిమా వచ్చినట్లు తెలియదు. పైగా రొటీన్ సబ్జెక్ట్ కావడంతో గోపీచంద్ ఉన్నా కలెక్షన్స్ రాలేదు. నయనతార ఉన్నా కూడా వసూళ్లు రాలేదు. మూడు రోజుల్లో కనీసం కోటి షేర్ కూడా తీసుకురాలేదు ఈ చిత్రం. ఇకపై వీక్ డేస్‌లో బాగా పర్ఫార్మ్ చేస్తుందనే నమ్మకాలు కూడా ఎవరిలోనూ కనిపించడం లేదు.
ఇది కూడా చూడండి
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Prakash Raj Panel | 11 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా
Benerjee | మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు: బెనర్జీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

