Aamir khan | అమీర్ ఖాన్ షాకింగ్ డెసిషన్..షారుక్ రూట్లోనే..?
అప్పట్లో ధూమ్ 3 తో పాటు మరికొన్ని సినిమాలు కూడా యావరేజ్ కంటెంట్ తోనే వచ్చి సంచలన విజయం సాధించాయి. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. వాళ్లకు తగ్గట్టు కంటెంట్ ఇవ్వకపోతే.. అక్కడ సూపర్ స్టార్ ఉన్నా కూడా కనీసం పట్టించుకోవడం లేదు.
టైం బాగున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేసినా బాక్సాఫీస్ (Box Office) దగ్గర సంచలన విజయం సాధిస్తాయి. అమీర్ ఖాన్ విషయంలో ఇదే జరిగింది. అప్పట్లో ధూమ్ 3 తో పాటు మరికొన్ని సినిమాలు కూడా యావరేజ్ కంటెంట్ తోనే వచ్చి సంచలన విజయం సాధించాయి. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. వాళ్లకు తగ్గట్టు కంటెంట్ ఇవ్వకపోతే.. అక్కడ సూపర్ స్టార్ ఉన్నా కూడా కనీసం పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ హీరోల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. అమీర్ ఖాన్ (Aamir khan)కు సైతం వరుసగా రెండు భారీ ఫ్లాపులు రావడంతో..ఆయన ఆలోచనలో పడిపోయాడు. ఒకప్పుడు ఈయన సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలై పోయేది. కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసేది.
త్రీ ఇడియట్స్, పీకే, ధూమ్ 3, దంగల్ లాంటి సినిమాలతో సెన్సేషనల్ రికార్డులు తిరగ రాసిన అమీర్ ఖాన్.. నాలుగేళ్ల కింద థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ (Thugs of Hindostan) సినిమాతో భారీ డిజాస్టర్ ఇచ్చాడు. అందులో బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన లాల్ సింగ్ చడ్డా (Lal singh chaddha) సినిమాకు కూడా దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కనీసం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాకు మొదటిరోజే 50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
కానీ ఈ సినిమాకు మాత్రం 5 రోజులు దాటిన ఇప్పటి వరకు 50 కోట్లు రాలేదు. దాంతో మిస్టర్ పర్ఫెక్ట్ డైలమాలో పడిపోయాడు. ఇకపై సినిమాలు చేయాలా వద్దా అని ఆలోచన చేస్తున్నాడు ఈయన. ఇలాంటి పరిస్థితుల్లో షారుక్ ఖాన్ (Shah Rukh khan) వెళ్లిన దారిలోనే తాను కూడా వెళ్లాలని చూస్తున్నాడు. నాలుగేళ్ల కింది వరకు షారుక్ వరుస సినిమాలు చేశాడు. అయితే 2018 తర్వాత ఈయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. దానికి ముందు వరుసగా అరడజన్ ప్లాపులు ఉన్నాయి.

అందుకే ప్రేక్షకులకు పూర్తిగా గ్యాప్ ఇచ్చి తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నాడు షారుక్. ప్రస్తుతం ఈయన పఠాన్, జవాన్, డంకీ సినిమాలు చేస్తున్నాడు. అమీర్ ఖాన్ కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు. మరో నాలుగైదు సంవత్సరాల వరకు ఈయన ఒక్క సినిమా కూడా చేయకూడదు అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అద్భుతమైన కథ దొరికే వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఈయన ఆలోచిస్తున్నాడు. మరి అమీర్ ఖాన్ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Read Also : Telugu Movies | ఈ వారం వరుస సినిమాలు..కానీ క్రేజ్ మాత్రం నిల్..!
Read Also : Aadi Sai Kumar Promo | పోలీస్ గెటప్స్ లో డైలాగ్స్ చెప్పిన సాయికుమార్, ఆది..ఫన్ ప్రోమో
Read Also : Baahubali writer | బాహుబలి రైటర్ కొత్త పీరియాడిక్ సినిమా ఇదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

