Laapataa Ladies | పెళ్లికూతురు మిస్సింగ్.. ఆసక్తికరంగా ‘లాపటా లేడీస్’ ట్రైలర్
Laapataa Ladies | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన ప్రొడక్షన్లో వచ్చిన, దోబీ ఘాట్ (Dhobi ghat), తారే జమీన్ పర్ (Taare Jamin Par), సీక్రెట్ సూపర్ స్టార్ (Secret Super Star), దంగల్ (Dangal) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించాయి.
Laapataa Ladies | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన ప్రొడక్షన్లో వచ్చిన, దోబీ ఘాట్ (Dhobi ghat), తారే జమీన్ పర్ (Taare Jamin Par), సీక్రెట్ సూపర్ స్టార్ (Secret Super Star), దంగల్ (Dangal) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇదిలా ఉండగా.. తన ప్రొడక్షన్లో వస్తున్న తాజా చిత్రం ‘లాపటా లేడీస్’ (Laapataa Ladies). అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. జమ్తారా(Jamtara) వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటిస్తుండగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ (Laapataa Ladies T) విడుదల చేశారు. ఈ ట్రైలర్ గమనిస్తే.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తుంది. కొత్తగా పెళ్లి అయిన ఓ జంట పెళ్లి అనంతరం ఇంటికి వస్తుండగా మధ్యలో తన భార్య మిస్ అవుతుంది. అయితే ఈ విషయం తెలియక వరుడు తన భార్య అనుకుని వేరే అతడి భార్యను ఇంటికి తీసుకువస్తాడు. తీరా ఇంటికి వచ్చిన చూసిన అనంతరం తన భార్య కాదని షాక్ అవుతాడు. దీంతో తన భార్య పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాడు. అయితే తన భార్య ఎలా మిస్ అయ్యింది. తన భార్య స్థానంలో వచ్చిన అమ్మాయి ఎవరు. ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఈ మూవీ 2024 మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రానుండగా దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో కిరణ్ రావ్ మెగాఫోన్ పట్టింది. ఆమె చివరగా 2010లో దోబీ ఘాట్ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ చిత్రం అప్పట్లో ఇంటర్వెల్ లేకుండా తీసిన మూవీగా రికార్డు సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

