బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కొద్ది రోజుల క్రితం తన రెండో భార్య కిరణ్‌రావుకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. డైవర్స్ విషయాన్ని అమీర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించగా, ఇది చూసి అందరు షాక్ అయ్యారు. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ, ఫ్రెండ్స్‌లా కలిసి ఉంటామని చెప్పిన ఈ జంట పలు సందర్భాలలో జంటగా కనిపిస్తున్నారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాకు గాను కిరణ్ రావు వర్క్ చేసిన విషయం తెల్సిందే.
ఆమె తో ఇప్పటికి సన్నిహిత సంబంధాలను అమీర్ ఖాన్ కొనసాగిస్తున్నాడు. తాజాగా తమ కుమారుడు ఆజాద్ బర్త్ డే కాగా, ఆయన బర్త్ డే వేడుకని అమీర్ , కిరణ్ రావ్ కలిసి జరిపించారు. ఈ పార్టీలో అమీర్ పెద్ద కొడుకు జునైద్ ఖాన్, మొదటి భార్య రీనా దత్త కూడా పాల్గొన్నారు. సెలబ్రేషన్స్‌కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ తదుపరి సినిమాలకు కూడా కిరణ్ రావు వర్క్ చేస్తుందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
అమీర్ చివరిగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా విషయానికి వస్తే ఆ సినిమా ఈ నెలలో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ లో ఉన్న కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇందులో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషించాడు.