లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘పులి మేక’. చక్రవర్తి కె రెడ్డి దర్శకుడు. జీ 5, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ సంస్థలు నిర్మించాయి. ఈ సిరీస్ ట్రైలర్‌ను యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆవిష్కరించారు. ఈ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి..ఐపీయస్ ఆఫీసర్ కిరణ్‌ప్రభ పాత్రను పోషిస్తున్నది. ఓ కేసును పరిశోధించే క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లేమిటి? పులి మేక ఆటలో అసలు పులి ఎవరన్నది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ నెల 24 నుంచి జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.