Aadi Keshava Movie | వైష్ణవ్ తేజ్ హిట్టు కొట్టి రెండేళ్లయింది. ఉప్పెన తర్వాత రిలీజైన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ సాధిస్తే.. ఆ తర్వాత రిలీజైన రెండు సినిమాలు కలిపి కూడా 50కోట్ల గ్రాస్ కూడా సాధించలేకపోయాయి. ప్రస్తుతం వైష్ణవ్ ఆది కేశవ అనే యాక్షన్ సినిమా చ్తేస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సారి మెగా మేనల్లుడికి హిట్టు ఖాయమని తెలుస్తుంది. పైగా ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటించనుండటంతో సినిమాపై జనాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ అప్డేను ప్రకటించారు.
ఈ సినిమాలోని సిత్తరాల సిత్తారవతి ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో చాలా కలర్ఫుల్గా అనిపించింది. వైష్ణవ్, శ్రీలీల డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ స్వర పరిచిన ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాను సితార సంస్థతో కలిసి తివిక్రమ్ తన సొంత బ్యానర్ ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ముందుకు ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కాని కుదరలేదు.