ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7జీ ఫిల్మ్స్ పతాకంపై శివ నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదలకానుంది. నైజాంలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ కానుంది. సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘వెయ్యి గబ్బిలాలు చెవిలో అరుస్తున్నట్లు ఉంటుంది డాక్టర్’ అంటూ ఓ అపరిచిత వ్యక్తి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగింది. భ్రమ, భ్రాంతి నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. ఇప్పటివరకు వచ్చిన సూపర్‌నేచురల్ థ్రిల్లర్స్‌కు భిన్నంగా ఉండే చిత్రమిదని, పారా నార్మల్ యాక్టివిటీస్‌ను పరిశోధించే ఆఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపిస్తారని, సీట్ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీమీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: అరివళగన్.