కొన్నేళ్ల క్రితం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగింది బొద్దుగుమ్మ హన్సిక. అందంతో పాటు తనదైన అభినయంతో యువతరంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి సినీ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. దాంతో మనసిచ్చిన వాడిని మనువాడి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలని నిర్ణయించుకుందట. ఈ భామ డిసెంబర్ 4న పెళ్లిపీటలెక్కబోతున్నట్లు ముంబయి సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సోహాల్ కతూరియా అనే ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో ఈ భామ కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నది. సోహాల్ కంపెనీలో హన్సిక ఓ భాగస్వామిగా ఉందని అంటున్నారు. పెద్దలు సమ్మతించడంతో వీరిద్దరూ పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారని తెలిసింది. రాజస్థాన్ జైపూర్లోని ముండోటా కోటలో హన్సిక వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి సన్నాహాలు మొదలయ్యాయని, కుటుంబ సభ్యులు..సన్నిహితుల సమక్షంలో వైభవంగా పెళ్లి వేడుక నిర్వహించబోతున్నారని తెలిసింది.