96 Couple | పెళ్లి చేసుకున్న ‘96’ మూవీ జంట.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Hotspot Movie Promotions | కోలీవుడ్ స్టార్ నటులు విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం 96. 2018లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష చిన్ననాటి పాత్రల్లో గౌరీ కిషన్, ఆదిత్య నటించిన విషయం తెలిసిందే.
Hotspot Movie Promotions | కోలీవుడ్ స్టార్ నటులు విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం 96. 2018లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష చిన్ననాటి పాత్రల్లో గౌరీ కిషన్, ఆదిత్య నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ చేసిన రామ్, జాను పాత్రలు అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. చిన్నప్పటి త్రిషగా జాను పాత్రలో గౌరీ కిషన్ మెప్పిస్తే.. చిన్నప్పటి విజయ్ సేతుపతి ‘రామ్’ పాత్రలో ఆదిత్య కనిపించి ప్రేక్షకులను ఫిదా చేశారు. అయితే తాజాగా ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ఫొటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా చేశారని సమాచారం.
వివరాల్లోకెళితే.. గౌరీ కిషన్, ఆదిత్య తాజాగా నటించిన చిత్రం ‘హాట్ స్పాట్'(Hotspot). విఘ్నేష్ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. బాలమణిమార్భన్ K J, సురేష్ కుమార్, గోకుల్ బెనోయ్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు నిజంగానే ఆదిత్య, గౌరీ కిషన్ పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే ఏకంగా వారిద్దరికి శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయితే తాజాగా దీనిపై మేకర్స్ స్పందిస్తూ ఇది ప్రమోషన్స్‌లో భాగంగా చేసినట్లు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

