Thalaivar 173 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ Thalaivar 173. ఈ చిత్రం నుంచి దర్శకుడు సుందర్ సీ తప్పుకోగా.. ఫైనల్‌గా డాన్, తేరి, మెర్సల్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సిబి చక్రవర్తి చేతుల్లో ల్యాండైంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.
డైరెక్టర్ సిబి చక్రవర్తి ఈ సినిమాలో రజినీకాంత్ కోసం టాప్ లీడింగ్ డిజైనర్లతో కలిసి 83 డిఫరెంట్ లుక్స్‌ను డిజైన్ చేశాడట. ఈ లుక్స్‌లో 3 యూనిక్ స్పెషల్ గెటప్స్‌ను షార్ట్ లిస్ట్ చేశారని ఇన్సైడ్ టాక్. ఈ మూడు గెటప్‌లను వ్యక్తిగతంగా రివ్యూ చేసిన రజినీకాంత్ తనకు సూట్ అయ్యే ఉత్తమ మాస్ లుక్‌ను ఫైనల్ చేశాడని సమాచారం. మొత్తానికి తాజా వార్తతో ఇంతకీ తలైవా ఎంపిక చేసిన లుక్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. మరి రాబోయే రోజుల్లో సిబి చక్రవర్తి టీం నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ జైలర్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. జైలర్ 2ను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఇప్పటికే రజినీకాంత్ క్లారిటీ కూడా ఇచ్చాడు. సీక్వెల్లో బాలీవుడ్ భామ విద్యాబాలన్‌తోపాటు కోలీవుడ యాక్టర్ సంతానం కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తుండగా.. మరి రాబోయే రోజుల్లో ఈ స్టార్ యాక్టర్లపై అఫీషియల్ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.
జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించారని తెలిసిందే. సీక్వెల్లో ఎవరెవరుండబోతున్నారన్నదానిపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
#Thalaivar173 – According to media reports, director Cibi Chakravarthi has designed around 83 different looks for Superstar #Rajinikanth in collaboration with leading designers..😮💥
Out of these, 3 unique special getups have now been shortlisted..🤝 Thalaivar will personally… pic.twitter.com/sCk7fzK9xW
— Laxmi Kanth (@iammoviebuff007) March 23, 2026
Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..
Iran: మేం కూడా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం: ఇరాన్ వార్నింగ్