కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty)హీరోగా నటించిన చిత్రం 777 చార్లీ (777 Charlie). ఈ సినిమా తెలుగు వెర్షన్ ను రానా సమర్పించగా.. సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
777 చార్లీ చిత్రంలో బాబీ సింహా, సంగీత శృంగేరీ, రాజ్ బీ శెట్టి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన 777 చార్లీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
ఈ చిత్రం ఇప్పటికే ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితా లో 116వ స్థానంలో నిలిచింది. 777 చార్లీ ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించి అరుదైన ఫీట్ సాధించింది. కాగా ఈ చిత్రం ఖాతాలో మరో మైల్ స్టోన్ చేరుకుంది. 50 రోజులుగా సక్సెస్ ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతున్న సినిమాగా ఫీట్ ఖాతాలో వేసుకుంది. కాసర్గోడ్లోని మ్యాజిక్ ఫ్రేమ్స్ మెహబూబ్ థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ మూవీ.
ఒరిజినల్ వెర్షన్ ప్రస్తుతం Voot ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే డబ్బింగ్ వెర్షన్ల స్ట్రీమింగ్ అప్డేట్ కూడా రానుంది. ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ (పెట్) ప్రవేశించి..అతడి జీవితాన్నిఎలా ప్రభావితం చేసిందనే కథాంశంతో వచ్చింది 777 చార్లీ. ఈ చిత్రాన్ని పరంవాహ్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించాడు రక్షిత్ శెట్టి.
777 Charlie advances towards 50 phenomenal days in the theatres♥️
Now watch 777 Charlie exclusively on @vootselect from the 29th of July✨@rakshitshetty @Kiranraj61 @RajbShettyOMK @sangeethaSring @justvoot @PrithvirajProd @stonebenchers @SureshProdns @UFOMoviez @KRG_Studios pic.twitter.com/CbQ8Ix2ZVy
— Paramvah Studios (@ParamvahStudios) July 28, 2022