నవంబర్ 20నుంచి 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

ఢిల్లీ,జూలై,6:భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(ఐఎఫ్ఎఫ్ఐ)52 వ ఎడిషన్ గోవాలో జరుగనున్నది. నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ కు సంబంధించిన పోస్టర్‌ను సమాచార,ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఆసియాలోని కాకుండా భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఒకటి. జనవరి 2021 లో 51 వ ఎడిషన్ విజయవంతం కావడాన్ని పరిగణనలోకి తీసుకుని ఐఎఫ్ఎఫ్ఐ 52 వ ఎడిషన్ హైబ్రిడ్ ఆకృతిలో జరుగుతుంది. ఈ వేడుకను భారత ప్రభుత్వ సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (డిఎఫ్ఎఫ్) గోవా రాష్ట్ర ప్రభుత్వం,భారతీయ చలన చిత్ర పరిశ్రమ సహకారంతో నిర్వహిస్తోంది.
ఐఎఫ్ఎఫ్ఐని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఎపిఎఫ్) గుర్తించింది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కొన్ని ఉత్తమమైన సినిమా రచనలను గుర్తిస్తుంది. అలాగే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ చిత్రాలను ప్రదర్శిస్తుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 52వ ఎడిషన్ పోటీ విభాగంలో పాల్గొనడానికి ఎంట్రీలను ఆగస్టు 31వరకూ సమర్పించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- film festival
- film news
- Goa
- IFFI
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

