జాతీయ అవార్డు బాధ్యతను పెంచింది
ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 2024 సంవత్సరానికిగాను ‘35-చిన్న కథకాదు’ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. నివేధా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్ని పోషించారు.
ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 2024 సంవత్సరానికిగాను ‘35-చిన్న కథకాదు’ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. నివేధా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్ని పోషించారు. నందకిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సృజన్ యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మాతలు. గురువారం ఈ సినిమా తాలూకు స్క్రీన్ప్లే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
2018లో ఓ చిన్న ఆలోచనతో మొదలైన ఈ సినిమా ప్రయాణం జాతీయ అవార్డును గెలుచుకునే వరకు వెళ్లడం ఓ మధురజ్ఞాపకమని, ఇది తమపై మరింత బాధ్యతను పెంచిందని, ఈ సినిమా స్క్రీన్ప్లే పుస్తకం చాలా మందికి ఉపయుక్తంగా ఉంటుందని దర్శకుడు నందకిషోర్ తెలిపారు. రెండేళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారని, ఇప్పుడీ సినిమా ఘనత ఢిల్లీ వరకు చేరిందని హీరో విశ్వదేవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

