Game Changer – Ram Charan| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియార అద్వానీ జంటగా నటించిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టార్‌ను అందుకుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా కావడంతో మెగా అభిమానులు భారీ నమ్మకం పెట్టుకున్నారు. అయితే శంకర్ అదే పాత స్టోరీతో ప్రేక్షకుల ముందు రావడంతో భారీ నష్టాన్ని చవి చూసింది. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రాగా దాదాపు రూ.150 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం.
అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్‌ని జీ5 ఓటీటీ వేదిక మార్చి 07న విడుదల చేసింది. హిందీ వెర్షన్ ఓటీటీలోకి వచ్చిన తొలిరోజు నుంచే ఈ సినిమా (Game Changer) టాప్ టెన్‌లో దూసుకుపోతుంది. ఈ చిత్రం హిందీలో ఇప్పటివరకూ 250 మిలియన్ మినిట్స్‌కు పైగా వ్యూస్ సాధించినట్లు జీ5 ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రామ్నందన్ (రామ్‌చరణ్) విశాఖ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. ఇదే సమయంలో అభ్యుదయ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) పదవీకాలం మరో ఏడాదిలో ముగుస్తుంది. సత్యమూర్తి కొడుకు బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య) ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేస్తాడు. తండ్రిని అడ్డుతొలగించి పదవి కోసం ఓ పన్నాగం పన్నుతాడు. సరిగ్గా ఇదే సమయంలో రామ్నందన్కు సంబంధించిన ఓ రహస్యం బయటపడుతుంది. ఏమిటా రహస్యం..? రామ్నందన్కు సత్యమూర్తికి వున్న అనుబంధం ఏమిటి..? ఈ కథలో అప్పన్న (రామ్‌చరణ్) ఎవరు? ముఖ్యమంత్రి కుర్చీ కోసం మోపిదేవి చేసిన కుట్రలని రామ్నందన్ ఎలా తిప్పికొట్టాడు? ఇవన్నీ తెరపై చూడాలి.
Game Changer