Ooru Peru Bhairavakona | రెండేళ్ల అందమైన ప్రయాణం.. సందీప్ కిషన్ షూటింగ్ అప్డేట్
Ooru Peru Bhairavakona | ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమాలో నటిస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan). తాజాగా ఊరు పేరు భైరవ కోన షూటింగ్ పూర్తయింది.
Ooru Peru Bhairavakona | ఈ ఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan). ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమాలో నటిస్తున్నాడు. వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ అందించి సందీప్ కిషన్ టీం. ఊరు పేరు భైరవ కోన షూటింగ్ పూర్తయింది. సినిమాపై స్వచ్చమైన ప్రేమతో నిండిన అందమైన హృదయాలతో రెండేళ్ల అందమైన ప్రయాణం..అంటూ లొకేషన్లో దిగిన స్టిల్ షేర్ చేశాడు సందీప్ కిషన్.
ఈ మూవీ నుంచి మేకర్స్ విడుదల చేసిన నిజమే నే చెబుతున్నా సాంగ్ (Nijame Ne Chebutunna)ను సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. నెట్టింటిని షేక్ చేస్తోంది. నిజమే నే చెబుతున్నా జానే జానా.. నిన్నే నే ప్రేమిస్తున్నా.. అంటూ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్ జాబితాలో చేరిపోయింది.
ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ్‌శేఖర్ అనింగి, వెన్నెల కిశోర్, కుషీ రవి, కావ్య థాపర్, హర్ష చెముడు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు వీఐ ఆనంద్. మరి ఈ సారి వీఐ ఆనంద్ సందీప్ కిషన్ సినిమాతో ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
నిజమే నే చెబుతున్నా లిరికల్ సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

