BANDLA GANESH | కమెడియన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. పవన్ కల్యాణ్, బండ్ల గణేశ్ కాంబో అంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జయంత్ సీ పరాన్జీ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటించిన చిత్రం తీన్మార్. బండ్ల గణేశ్ నిర్మించారు.
తీన్మార్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయినా మ్యూజికల్ హిట్‌గా నిలువడమే కాకుండా ఓ వర్గం ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో బండ్ల గణేశ్ ఈ సినిమాను కొన్ని మార్పులతో రీరిలీజ్ చేయాలని హామీనిచ్చాడు. ఇప్పుడిదే కమిట్మెంట్ను గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్.
తీన్మార్ నేటితో 15 సంవత్సరాలుపూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నెట్టింట ఓ అభిమాని పవన్‌కల్యాణ్ బర్త్ డేసందర్భంగా తీన్మార్ రివైజ్డ్ వెర్షన్‌ను విడుదల చేయాలని బండ్ల గణేశ్‌కు సలహా ఇచ్చాడు. దీనికి బండ్ల గణేశ్ స్పందిస్తూ.. 100 శాతం బ్రో.. అని రిప్లై ఇచ్చాడు. ఈ రీట్వీట్‌తో తీన్మార్ మళ్లీ థియేటర్లలో సందడి చేయడం పక్కా అని మరోసారి క్లారిటీ వచ్చేసింది.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీ ఒరిజినల్ రిలీజైన టైంలో ప్రత్యేకించి డబ్బింగ్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఒకవేళ సినిమాలో కొన్నిమార్పుచేర్పులు చేసి రీరిలీజ్ చేస్తే మంచి రెస్సాన్స్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు నెటిజన్లు, సినీ జనాలు. మరి బండ్ల గణేశ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాకు కొత్త టచ్ ఏదైనా ఇస్తాడేమో చూడాలి.
100% Bro 😎 https://t.co/ISyFnkqjlj
— BANDLA GANESH. (@ganeshbandla) April 13, 2026
Ambedkar Jayanti | తెలంగాణభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళులు.. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్
Alia Bhatt | ‘డ్రాగన్’ కోసం ఆలియా?.. ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని ఎండగడుదాం : కేటీఆర్