ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తల్లి అరుణా భాటియా బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 3న తీవ్ర అనారోగ్యంతో ఆమె ముంబైలోని హీరానందాని హాస్పిటల్లో చేరారు. అప్పటి నుంచీ ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. ఆమె అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న అక్షయ్.. రెండు రోజుల కిందట యూకేలో షూటింగ్ నిలిపేసి హుటాహుటిని ముంబైకి వచ్చాడు. బుధవారం తన తల్లి ఇక లేరన్న విషయాన్ని అక్షయ్ ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. భరించలేనంత బాధగా ఉందని అతను తన ట్వీట్లో అన్నాడు. మా అమ్మ శ్రీమతి అరుణ భాటియా ఇవాళ కన్నుమూశారు. అక్కడ మరో ప్రపంచంలో మా నాన్నతో తిరిగి కలిశారు. ఓం శాంతి అని అక్షయ్ ట్వీట్ చేశాడు.