Skoda x Zepto | జెప్టో ద్వారా కార్ల డెలివరీ..? ఆసక్తికరంగా స్కోడా ఇండియా టీజర్ వీడియో
Skoda x Zepto | స్కోడా ఇండియా.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ జెప్టోతో కలిసి కార్లను ఆన్లైన్లో విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Skoda x Zepto | క్విక్ ఈకామర్స్ సంస్థలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జొమాటో, జెప్టో (Zepto), బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్. ఇవి మనకు అవసరమైన వస్తువులను ఆర్డర్ చేసుకున్న నిమిషాల్లోనే నేరుగా డోర్ డెలివరీ చేస్తాయి. పాలు, కూరగాయలు, నిత్యావసర సరకులు, ఫుడ్ వంటివి వీటి ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆయా సంస్థలు తొలుత ఇంటికి అవసరమైన సరకులను డెలివరీ చేసేవి. ఆ తర్వాత కస్టమర్ల డిమాండ్‌ను బట్టి స్మార్ట్ ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్ ఇతర ఖరీదైన వస్తువులను కూడా నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు కార్లను కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
స్కోడా ఇండియా పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం ఆసక్తిని పెంచుతోంది. ఈ టీజర్ వీడియో చూస్తే స్కోడా ఇండియా.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ జెప్టోతో కలిసి కార్లను ఆన్లైన్లో విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్కోడా షోరూమ్‌కు వెళ్తారు. అక్కడ ఓ కారును డెలివరీ చేసేందుకు ట్రక్కులో తీసుకెళ్లడం చూడొచ్చు. ఇక చివర్లో ‘Skoda x Zepto: Coming soon’ అంటూ వీడియోను ముగిస్తారు.
ఈ వీడియో షేర్ చేసిన స్కోడా ఇండియా ‘ఫాస్ట్ × ఫ్రెష్.. జెప్టో, స్కోడా ఏం చేయబోతున్నాయో మీరేమైనా ఊహించగలరా..?’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు జెప్టో ద్వారా కార్ల విక్రయం ఎలా సాధ్యం..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కిరాణా సామగ్రి మాదిరిగానే నిమిషాల్లోనే కార్లు కూడా డెలివరీ చేస్తారా..? లేక ఎక్కువ సమయం పడుతుందా..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Fast × Fresh. Any guesses on what Zepto and Škoda are cooking up? Stay tuned! 👀🚗✨#SkodaIndia #SkodaIndiaNewEra #LetsExplore pic.twitter.com/tEHyvrhG4R
— Škoda India (@SkodaIndia) February 4, 2025
Also Read..
illegal Indian immigrants | 205 మంది వలసదారులతో.. అమృత్సర్ చేరుకున్న యూఎస్ మిలటరీ విమానం
Kangana Ranaut | వ్యాపార రంగంలోకి బాలీవుడ్ క్వీన్.. హిమాలయాల్లో కేఫ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
ట్రక్ పార్క్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన.. మద్దతు తెలిపిన హరీశ్ రావు
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’ ట్రైలర్ విడుదల.. లాయర్‌గా అదరగొట్టిన బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

