Hyderabad | ప్రపంచ అత్యంత సంపన్న నగరాల్లో మన హైదరాబాద్.. టాప్-5 భారతీయ నగరాల్లో చోటు
Hyderabad | అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరం.. సంపద సృష్టిలోనూ సత్తా చాటుతున్నది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో స్థానం దక్కించుకున్నది. ఈ క్రమంలోనే టాప్-5 భారతీయ నగరాల్లో నిలిచింది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్.. ‘వరల్డ్ వెల్దీయెస్ట్ సిటీస్ రిపోర్ట్-2023’ని విడుదల చేసింది.
Hyderabad | సంపద సృష్టిలోనూ హైదరాబాద్ సత్తా చాటుతున్నది.
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న టాప్-5 సిటీస్‌లో రాష్ట్ర రాజధాని నగరం కూడా ఉన్నది.
గత పదేండ్లలో నగరంలోని అపర కుబేరులు (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) ఏకంగా 78 శాతం పెరిగినట్టు హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన తాజా గ్లోబల్ నివేదిక చెప్తున్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరం.. సంపద సృష్టిలోనూ సత్తా చాటుతున్నది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో స్థానం దక్కించుకున్నది. ఈ క్రమంలోనే టాప్-5 భారతీయ నగరాల్లో నిలిచింది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్.. ‘వరల్డ్ వెల్దీయెస్ట్ సిటీస్ రిపోర్ట్-2023’ని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 97 నగరాలతో ఈ వార్షిక జాబితా విడుదలైంది. ఇందులో హైదరాబాద్ కూడా మెరిసింది.2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో అపర కుబేరులు (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్) ఏకంగా 78 శాతం పెరిగినట్టు తాజా నివేదిక స్పష్టం చేసింది. స్వరాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఇదో నిదర్శనంగా నిలుస్తున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర్నుంచి సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో ప్రధాన రంగాలన్నింటికీ పెద్దపీట వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఐటీ, ఔషధ, రియల్టీ, ఎంఎస్ఎంఈ నుంచి కుటీర పరిశ్రమలు, స్టార్టప్‌ల వరకు చేయూతనందించడం కలిసొచ్చిందన్న అభిప్రాయాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
గ్లోబల్ నగరాల్లో..
ఈ జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ నగరం 3,40,000 మంది డాలర్ మిలియనీర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన నగరంగా నిలిచింది. ఇక టాప్-10 నగరాల్లో న్యూయార్క్ తర్వాత టోక్యో, ది బే ఏరియా, లండన్, సింగపూర్, లాస్ ఏంజిల్స్, హాంకాంగ్, బీజింగ్, షాంఘై, సిడ్నీ నగరాలున్నాయి. అయితే వీటిల్లో గతంతో పోల్చితే టోక్యో, లండన్, హాంకాంగ్ నగరాల్లో మాత్రం అపర కుబేరుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
- 2012- 2022 మధ్య భారతీయ సంపన్న నగరాల్లో బెంగళూరులో గరిష్ఠంగా 88 శాతం హెచ్ఎన్డబ్ల్యూఐలు పెరిగారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో 78 శాతం పెరుగుదల కనిపించింది
- 10 కోట్లకుపైగా డాలర్ల సంపద కలిగినవారు హైదరాబాద్‌లో 40 మంది ఉన్నట్టు తాజాగా తేలింది
- అమెరికాలోని ఆస్టిన్, చైనాలోని హాంగ్జౌ నగరాల్లో 2012 నుంచి 2022 మధ్య హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్డబ్ల్యూఐ) సంఖ్య 100 శాతానికి పైగా పుంజుకున్నది
- ఈ జాబితాలో హైదరాబాద్‌సహా భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఐదు నగరాలు
- ఈ ఐదు నగరాల్లో 1,25,400 మంది డాలర్ మిలియనీర్లు, 65మంది డాలర్ బిలియనీర్లున్నారు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

