Rs.2000 notes | భారత కరెన్సీ మాకొద్దు బాబోయ్.. రెండువేల నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్న గల్ఫ్ మనీ ఎక్స్చేంజీలు
రూ.2000 నోట్ల ఉపసంహరణ సెగ.. ప్రవాస భారతీయులు, విదేశాలకు వెళ్లిన పర్యాటకులకూ తగులుతున్నది. యూఏఈసహా గల్ఫ్ దేశాల్లో రూ.2000 నోట్ల మార్పిడి కష్టంగా మారింది. అక్కడి మనీ ఎక్స్చేంజీలు రూ.2000 నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి.
- గల్ఫ్‌లో రెండువేల నోటు కష్టాలు
- ఇబ్బందుల్లో ప్రవాస భారతీయులు
Rs.2000 notes | న్యూఢిల్లీ, మే 25: రూ.2000 నోట్ల ఉపసంహరణ సెగ.. ప్రవాస భారతీయులు, విదేశాలకు వెళ్లిన పర్యాటకులకూ తగులుతున్నది. యూఏఈసహా గల్ఫ్ దేశాల్లో రూ.2000 నోట్ల మార్పిడి కష్టంగా మారింది. అక్కడి మనీ ఎక్స్చేంజీలు రూ.2000 నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి. సాధారణంగా మనీ ఎక్స్చేంజీల్లో ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్లు కొంత ఫీజును తీసుకుని భారతీయ కరెన్సీని స్థానిక కరెన్సీలోకి మార్చి ఇస్తారు. అయితే రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లోని మనీ ఎక్స్చేంజీల్లో రూ.2000 నోట్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో ఈ నోట్లున్న ప్రవాస భారతీయులు, పర్యాటకులు ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలో పడినైట్టెంది.
బ్యాంక్ ఖాతాల్లో వేసుకోండి
రూ.2000 నోట్లను మళ్లీ మేము మార్చుకోగలమా? లేదా? అన్న భయంతోనే ప్రవాస భారతీయులు, టూరిస్టుల నుంచి ఆ నోట్లను తీసుకోవడం లేదని దుబాయ్‌లోని మనీ ఎక్స్చేంజ్ యూనియన్ల అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సదరు నోట్లను మీమీ భారతీయ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలనీ వారికి సూచిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను కూడా ఏ భారతీయులూ తీసుకోవడం లేదని అంటున్నారు. ‘చలామణి నుంచి ఉపసంహరిస్తున్నందున మా వద్ద ఇప్పటికే ఉన్న రూ.2000 నోట్లకు ఎక్స్చేంజ్ రేటు బాగా తగ్గుతున్నది. ఇది మాకు నష్టమే. అందుకే మరిన్ని నోట్లను తీసుకోవడం లేదు’ అని దుబాయ్‌లోని అల్ రజౌకి ఎక్స్చేంజ్ అధికారి ఒకరు అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

