Twitter-Elon Musk | ట్విట్టర్ రూపు మారబోతున్నదా.. అందుకే ‘ఎక్స్’గా మస్క్ మార్చారా?!
Twitter-Elon Musk | ట్విట్టర్ ‘బర్డ్’లోగో స్థానే ఎక్స్ తీసుకొచ్చారు ఎలన్ మస్క్. దీన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ స్థాయి నుంచి సూపర్ యాప్ గా తీర్చిదిద్దుతామని సంకేతాలిచ్చారు.
Twitter-Elon Musk | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్.. గతేడాది నుంచి పలు మార్పులు తెచ్చిన ఎలన్ మస్క్.. మున్ముందు దాని స్వరూపమే మార్చేయనున్నారు. రెండు రోజుల క్రితం ‘ట్విట్టర్’ లోగోలో ‘బర్డ్’ తీసేసి.. ‘ఎక్స్’ అనే లోగో తీసుకొచ్చారు. అలా ట్విట్టర్ పేరును ‘ఎక్స్’ ఎందుకు మార్చారనే అంశంపై ఇంటర్నెట్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. నెటిజన్ల చర్చలపై ఎలన్ మస్క్ రియాక్టయ్యారు. ఇక నుంచి ట్విట్టర్ ‘సూపర్ యాప్’గా మార్చబోతున్నట్లు తెలిపారు. అందుకే ట్విట్టర్ లోగోలో ‘బర్డ్’ తీసేసి ‘ఎక్స్’ చేర్చామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలు, రాజకీయాలపై సెలబ్రిటీలు, సినీ స్టార్లు, రాజకీయ నేతలు, క్రీడాకారులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ‘ట్విట్టర్’లో వెల్లడించేవారు. వాక్ స్వాతంత్ర్యానికి మారుపేరుగా రూపుదిద్దే లక్ష్యంతో ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎక్స్ కార్పొరేషన్ టేకోవర్ చేసింది.
త్వరలో ట్విట్టర్లో సమూల మార్పులు రాబోతున్నాయి. ఇక నుంచి యూజర్లు తమ ఆర్థిక లావాదేవీల నిర్వహణకు ఇతర యాప్‌లు వాడాల్సిన అవసరం లేదని ఎలన్ మస్క్ తేల్చేశారు. ట్విట్టర్ ‘ఎక్స్’ను ఎవ్రీథింగ్ యాప్‌గా అంటే సూపర్ యాప్‌గా మార్చబోతున్నట్లు తెలిపారు.
‘ట్విట్టర్’ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చడంతో బ్యాంకింగ్, డిజిటల్ కొనుగోళ్లు, చెకింగ్, క్రెడిట్ కార్డుల వాడం, పెట్టుబడులు, రుణాలకు సంబంధించిన సేవలు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. చైనా ‘వీచాట్’ మాదిరిగా ఒకే వేదికపై అన్ని సేవలు పొందొచ్చునన్నమాట. 140 అక్షరాల పరిమితి గల ట్వీట్ చేసినప్పుడు ట్విట్టర్ అనే పేరు సరిపోతుందని, కానీ ఇప్పుడు ట్విట్టర్లో పెద్ద సైజ్ వీడియోలు కూడా అప్ లోడ్ చేయొచ్చునన్నారు ఎలన్ మస్క్. ఇటువంటి పరిస్థితుల్లో ట్విట్టర్ పేరు వాడటంలో అర్థం లేదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

